ఉంగా ఉంగా బుల్లి పాటలు పాడుతున్నావా అమ్మ కొంగుతో బూచి ఆటలు ఆడుతున్నావా తల్లిపాలను త్రాగి ఆకలి తీరిందంటే పువ్వుల్లాంటి బోసినవ్వులు రువ్వుతున్నావా బొమ్మల పెళ్ళి చేసి ఆటపాటలతో అలసి నాన్న కాళ్లపై తూగుటుయ్యాల ఊగుతున్నావా అన్నమూపుపై చేరి గుర్రపు స్వారి చేసి బొమ్మ కత్తితో బామ్మ మీదికి దూకుతున్నవా చందమామను చూపి కావాలంటూ ఏడ్చి తాతగారిని కోరికలెన్నోకోరుతున్నావా ముద్దు మాటలు పలికే ఆ సందడి రాసే "చల్లా" అందరి మదిలో అనుబంధాన్ని పెంచుతున్నావా |
Wednesday, April 30, 2014
చల్లా గౙల్-11/ Dt.30-4-2014
Friday, April 25, 2014
ఇంకా గుర్తుందిలే - గజల్ - జాన్ హైడ్ కనుమూరి
అలా అలా దాగిన జలతారు పరదాలచాటు ఇంకా గుర్తుందిలే
గల గలా సాగిన నవ్వులతీరు పూలైనచోటు ఇంకా గుర్తుందిలే
నీకై నిరీక్షించి నిరీక్షించిన ఆ సాయంకాలం
కనులెదుటే మెరుపులా వచ్చిపోయిన జాడ ఇంకా గుర్తుందిలే!
పరాకుగా విదిల్చిన మాటకు నొచ్చుకున్నావో లేదో
ప్రక్కకు తిరిగి గిర్రున రాల్చిన ముత్యపుబొట్టు ఇంకా గుర్తుందిలే !
చిగురుతొడిగిన మొగ్గ సిగ్గులొలికిన నా బుగ్గ
అందానికే అందమని చదివిన ఆనాటి కవిత ఇంకా గుర్తుందిలే!
గుబులుపెట్టిన ఆ నీలిమేఘం భళ్ళున రాలితే
చెట్టునీడలో ఒదిగి ఒదిగి తడిన ఆ వాన ఇంకా గుర్తుందిలే!
బాటసారినై అలసి నీ గుమ్మాన దాహమడిగితే
చిరునవ్వుల కూ'జాను'ఒంపి తడిపిన తీరు ఇంకా గుర్తుందిలే !
**********25.4.2014
Sunday, April 20, 2014
Thursday, April 17, 2014
ఆ వెన్నెల...కన్నెగంటి వెంకటయ్య -గజల్
ఆ వెన్నెల వెలుగును చూసి ఎంతగా మురిసిపోతిని..!?
ఈ వన్నెల తెలుగును చూసి అంతగా మురిసిపోతిని..!!
//ఆ వెన్నెల//
ఈ వన్నెల తెలుగును చూసి అంతగా మురిసిపోతిని..!!
//ఆ వెన్నెల//
తెలుగు చంద్రకళలను సాంతం పరభాషా రాహువు పట్టి
నమిలి మింగె తీరును చూసి ఎంతగా కుమిలి పోతిని.
//ఆ వెన్నెల//
నమిలి మింగె తీరును చూసి ఎంతగా కుమిలి పోతిని.
//ఆ వెన్నెల//
సహజ తెలుగు వెన్నెల ముందు కృత్రిమ వెలుగులు నిలబడవని
గ్రహించని ద్రోహుల చూసి ఎంతగా రగిలి పోతిని.
//ఆ వెన్నెల//
గ్రహించని ద్రోహుల చూసి ఎంతగా రగిలి పోతిని.
//ఆ వెన్నెల//
తెలుగు జాబిలమ్మకు భయపడి పరభాషాచీకటి తొలిగి
రాబోయే జిలుగును చూసి ఎంతగా ఆశపడితిని.
రాబోయే జిలుగును చూసి ఎంతగా ఆశపడితిని.
//ఆ వెన్నెల//
కన్నెగంటి కన్నుల చూసి ఎంతగా హర్షించితిని.
//ఆ వెన్నెల//
17.4.14.
చల్లా గజల్
ఎక్కడో చిరుజల్లు పడితే ఇక్కడెందుకు గొడుగు పడతావు
ఎక్కడో పారేటి నీటికి ఇక్కడెందుకు చాల్లు కడతావు
గాయమొకరికి వైద్యమొకరికి రోగమెప్పుడు కుదుట పడును
మనసుకే అవినీతి కుడితే మనిషికెందుకు మందు పడతావు
మనసుకే అవినీతి కుడితే మనిషికెందుకు మందు పడతావు
సొమ్ము ఒకడిది షొకు ఒకడిది దేశమెప్పుడు బాగుపడును
పొరుగునే పూరిళ్ళు ఉన్నా పరులకెందుకు మేడ కడతావు
పొరుగునే పూరిళ్ళు ఉన్నా పరులకెందుకు మేడ కడతావు
బాధలొకరివి భాగ్యమొకరిది సమత మమతలు ఎక్కడున్నవి
ఆకలంటూ ఆర్తినొందే వారికెందుకు కడుపు కొడతావు
ఆకలంటూ ఆర్తినొందే వారికెందుకు కడుపు కొడతావు
కీర్తికోసం ఎన్ని జిత్తులో తెలిసి ఎందుకు బాధపడతావు
17.4.2014