నిండు జగమంతా ఎరిగినది అమ్మమనసు
గోరుముద్దలు తినిపిస్తూ చందమామచూపిన
మురిపాల మీగడ పాల బువ్వైనదీ అమ్మమనసు
బుడిబుడి అడుగులకు చూపుడు వ్రేలునిచ్చి
వడివడిగా పథాలలోకి నడిపినదీ అమ్మమనసు
భాను కిరణాలతో ఉదయరాగ మాలపించి
ధాత్రికే సహనం నేర్పినదీ అమ్మమనసు
జగతిని మమతల నెలవుల కాంతులలో
జ్యోతియై కరిగికరిగి వెలుగునిచ్చినదీ అమ్మమనసు
అనుబంధాలు పెనవేసే జాడల జాతరలో
సువాసనల గంధమై పరిమళించినదీ అమ్మమనసు
పద్మాలు వికసించే శరత్ చంద్రకాంతిలో
స్వాతి ముత్యమై మెరిసినదీ అమ్మమనసు
ప్రేమనెరిగిన శ్యామాక్షరాల యింటిలో
సిరులనిచ్చే శ్రీ నివాసమైనదీ అమ్మమనసు
విజయ పథాన నేను నడువగా
లోకాన ప్రవీణతలో నడిపినదీ అమ్మమనసు
నేర్చిన జ్ఞానంతో పయనించే మార్గంలో
వెలలేని అపరంజి అయినదీ అమ్మమనసు
తీపితీపి జ్ఞాపకాలు జగమంతా తెలిపే
యెదను పలికే సుధలు నింపినదీ అమ్మమనసు
కనిపెంచిన పిల్లలు తనయెదుటే ఎదిగి
వృక్షాలై నీడనిస్తుంటే సంతశించేదీ అమ్మమనసు
శృతిచేసిన రాగం ప్రీతిమీర ఆలపించే
"జాను''తెలుపు నాల్గుమాటలలో ఇమడనిదీ అమ్మమనసు
గోరుముద్దలు తినిపిస్తూ చందమామచూపిన
మురిపాల మీగడ పాల బువ్వైనదీ అమ్మమనసు
బుడిబుడి అడుగులకు చూపుడు వ్రేలునిచ్చి
వడివడిగా పథాలలోకి నడిపినదీ అమ్మమనసు
భాను కిరణాలతో ఉదయరాగ మాలపించి
ధాత్రికే సహనం నేర్పినదీ అమ్మమనసు
జగతిని మమతల నెలవుల కాంతులలో
జ్యోతియై కరిగికరిగి వెలుగునిచ్చినదీ అమ్మమనసు
అనుబంధాలు పెనవేసే జాడల జాతరలో
సువాసనల గంధమై పరిమళించినదీ అమ్మమనసు
పద్మాలు వికసించే శరత్ చంద్రకాంతిలో
స్వాతి ముత్యమై మెరిసినదీ అమ్మమనసు
ప్రేమనెరిగిన శ్యామాక్షరాల యింటిలో
సిరులనిచ్చే శ్రీ నివాసమైనదీ అమ్మమనసు
విజయ పథాన నేను నడువగా
లోకాన ప్రవీణతలో నడిపినదీ అమ్మమనసు
నేర్చిన జ్ఞానంతో పయనించే మార్గంలో
వెలలేని అపరంజి అయినదీ అమ్మమనసు
తీపితీపి జ్ఞాపకాలు జగమంతా తెలిపే
యెదను పలికే సుధలు నింపినదీ అమ్మమనసు
కనిపెంచిన పిల్లలు తనయెదుటే ఎదిగి
వృక్షాలై నీడనిస్తుంటే సంతశించేదీ అమ్మమనసు
శృతిచేసిన రాగం ప్రీతిమీర ఆలపించే
"జాను''తెలుపు నాల్గుమాటలలో ఇమడనిదీ అమ్మమనసు
************
excellent & fabulous manchi treat icchinattuga vundi faebook variki .............dhanyavaadalu mee kavita patimaku............jyothiprasad.
ReplyDeleteRaghavendra Nuttaki
ReplyDeleteబాగుంది మాష్టారు." ధాత్రి" ఎక్కువ శాతం ఇమిడితే యాద్రుస్చ్చికంగానే భానూ యితరులూ తమవంతుగా స్తానం పొందారు . బాగుంది యీ కవనం. అభినందనలు.
బావుంది జాన్ జీ. అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం మనతత్వం మీదని మీదైన శైలిలో ఘల్లుఘల్లుమని ఘజల్ పేర్చుకున్నారు..
ReplyDeleteధన్యవాదాలు వాసుజీ
ReplyDeleteఆ సమయానికి అలా తొచింది
chaalaa baagundi sir.....Ammaa gurinchi chaalaa baagaa cheppaaru...thank you very much
ReplyDeletemarvellous amma manasu.......
ReplyDeleteThank you Shamili
ReplyDeleteThank you Srilathabehara
ReplyDeleteచాలా బాగుంది జాన్ గారు
ReplyDelete