ఆకురాలిన శిశిరానికి కోకిలగాన మెవరునేర్పారు?
మబ్బుకమ్మిన మనసుకు నెమలినాట్య మెవరునేర్పారు?
ఊపిరి ఊగిసలు ఊయలూగే ఉయ్యాలలో
స్వరగతుల వేణుగాన మవ్వడమెవరునేర్పారు?
బడికెళ్ళిన బాల్యం కన్నువిప్పిన వేళలో
సొగసులెరిగి సిగ్గు మొగ్గవ్వడమెవరు నేర్పారు?
తూలిపోయే నడకనేర్చిన జీవన పథాలలో
పదుగురెరిగే పరుగులవ్వడమెవరునేర్పారు
దిక్కులెటు కనిపించని దృక్కులన్నిటిలో
మదినిండిన సిరులవానలో తడవడమెవరునేర్పారు
పదనిసలు తెలియని పదాల రాగలలో
జానుతెలునుగు పాటై ప్రవహించడం
నీకెవరునేర్పారు?
-----------------------------------------------------జాన్ హైడ్ కనుమూరి
|