నీవు ఖాళీచేసిన కుర్చీ ఏదో చెబుతుంది
నీవు పంచిన మాటల మూటలే విప్పుతుంది
బెదురు బెదురుగా ఆఫీసున అడుగెడ్తే
నేనున్నానని నీవిచ్చిన భరోసాయేదో చెబుతుంది
జీవితమైనా కాగితమైనా స్వచ్చమైనదంటూ
విప్పిచె
పరిచయాలు పెరిగిన పనిదారుల్లో
ఆకలిగమనిం
కలతచెందిన మనసు కన్నీరయితే
వెన్నుచరిచి వూతమిచ్చిన వైనమేదోచెబుతుంది
ఎవరొచ్చి ఆక్రమిస్తారోననే దిగులు
అలజడై పెరిగే గుండె ధ్వనిదేదో చెబుతుంది
నీవొదిలిన కుర్చీ భర్తీ అవ్వొచ్చేదో రోజు
ఎన్నటికీ నా మదీ నిండని వెలితేదో చెబుతుంది
( This ghazal for నిషిగంధ నిషి
ప్రక్క కుర్చీలోని సహోద్యోగి వేరే ఉద్యోగానికి వెళ్ళితే కాళీ అయిన కుర్చిని చూస్తే గుర్తొచ్చే, మిస్సయ్యే అంశాలు )
No comments:
Post a Comment