హృదయాలు నిండుగా ఉన్నవేళ పండగే కదా!
జీవితాన కలలుపండగా జరుపుకొనేది పండగే కదా!
అనాధలైన జీవితాలు ఆరుబయట నిదురిస్తే
గజగజ వణికే చలికి దుప్పటవ్వడం పండగే కదా!
వెన్నెలలు చూడని చీకటి బ్రతుకుల్లో
వెలుగుల రేఖలు వెలిగించడం పండగే కదా!
చీకటద్దుకున్న మోమున నిరాశల జీవనాన
నేనున్నానని చేయూత నివ్వడం పండగే కదా!
వినువీధుల్లో ఎగిరిన ఝండా రెపరెపలు
నిరుప్రేద బ్రతుకుల్లో వికసించడం పండగే కదా!
వీధివీధిన తిరిగే అనాధ పిల్లలకు
బడికినడిపే పుస్తకాల సంచవ్వడం పండగే కదా
ఆకలితో అలమటించే అన్నార్తుల జీవనాన
ఓరోజు పసందైన భోజనమవ్వడం పండగే కదా
వేవేల తెలుగు పాటల పూదోటలో
జాను ' తెనుగుపాటల మాలవ్వడం పండగే కదా!
అవును జాన్ సాబ్ .ఆర్తులను ఆడుకోవడానికి చేసిన యే చిన్న ప్రయత్నంతో నైనా వారిలో కలిగే ఆనందం చూస్తే మnaకు అది నిజమైన పండుగ. గజల్ బాగుంది....Nutakki Raghavendra Rao (kanakambaram)
ReplyDelete