నిన్నే దాటిపోవాలని చేసే ప్రయత్నంలో నే ఓడిపోతుంటానులే!
నన్ను నడిపే నా నావికవని మరచి నే ఓడిపోతుంటానులే!
నా కనుసన్నలలో నడిపించి అడుగులకు మడుగులొత్తే
జవదాటని కొంగున ముడివేయాలని నే ఓడిపోతుంటానులే!
అనురాగానికి పదములల్లి పలికే పలుకులెల్ల
నా అడుగు జాడలలో నడిపించాలని నే ఓడిపోతుంటానులే!
ఎగబ్రాకే కొమ్మ రెమ్మలకు జీవన వూతమైనిలిచి
శిఖరమెక్కిన చోట్ల చిగురునవ్వాలని నే ఓడిపోతుంటానులే!
నాకు నువ్వు నీకు నేననని తలపు మరచిన వేళ
సహనపు చూపుల కొండనెదుర్కోలేక నే ఓడిపోతుంటానులే!
నర్తించే పాదాలకు ఆంక్షల సంకెళ్ళు వేయాలనుకుంటూ
కరుణనిండిన కౌగిలిలో కరిగి కరిగి నే ఓడిపోతుంటానులే!
కలిసి నడిచే ఏడడుగుల్లో కలవని మాటలెన్నో
ఇమడ్చలేక సతమతమౌతూ నిరంతరం నే ఓడిపోతుంటానులే!
ఒకరినొకరు అధిగమించే ఆదిపత్యాల మధ్య
గెలుపు ఓటమి లేవని తెలుకోలేక నే ఓడిపోతుంటానులే!
ఏకమయ్యే జాడమరచి నేను నువ్వని పెదవి విరచి
ఆజానుబాహువైన నీ ప్రేమ ఎదుట నే ఓడిపోతుంటానులే!
జాన్ హైడ్ కనుమూరి
------------------------------ -----------------------------
27.03.2012 between 21.00 and 23.30 hours

------------------------------