చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు
ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు
వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటే
అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు
అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు
ప్రతినిముషం నరకంగా రాతిరంత గండంగా
గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు
గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు
ఎన్నికోర్కెలెన్నికలలు గంగపాలు అవుతుంటే
వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు
వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు
మనిషి కాదు ఉత్తి మాట కూడ జాడ లేకుంటే
మనసు ఎంత నలిగిందో నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు
మనసు ఎంత నలిగిందో నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు