ఒంటరిగానే...పెన్నాశివరామకృష్ణ - గజల్,
నీడల నుంచీ నీ కన్నీటిని దాచుకునే రోదించాలి
ఒంటరిగానే దీపాలన్నీ ఆర్పుకునే రోదించాలి
గాయాలను నీ అతిథులుగా ఎపుడూ
సంభావించుకొని
అతిథుల నందరినీ హృదయానికి హత్తుకునే
రోదించాలి
జీవన దేవత కొక హారం కానుక
ఇవ్వాలనుకుంటే
అశ్రువులను మరుమల్లెల మాలగ కూర్చుకునే
రోదించాలి
గాయాలన్నీ సులోచానాలై లోకం తీరును
తెలిపాయి
గాయం కూడా మనిషికి వరమని తెలుసుకునే
రోదించాలి
దేహంతోనే దహనం అయ్యే రహస్య వేదన
వేధిస్తే
నే హృదయాన్ని నీవే కౌగిలించుకునే
రోదించాలి
ఆనందం మూయించిన కనులను, అశ్రువులే తెరిపించేది.
పవిత్ర గ్రంథంగా ప్రతి అశ్రువునూ
మార్చుకునే రోదించాలి
ప్రతి వేదనకూ కారణమడిగే లోకంతోనే
చిక్కంతా
ఎవరికి వినబడకుండా, పెదవులు మూసుకునే రోదించాలి
గాయపడడమే వ్యసనమైతె విలపించకురా "
పెన్నా "
చెరగని గాయపు మరకను నిత్యం నిమురుకునే
రోదించాలి
No comments:
Post a Comment